స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మేజిక్ ఫిగర్(113) కన్నా ఎక్కువగా 23 స్థానాలు గెలిచి 136 స్థానాలతో తిరుగులేని పార్టీగా నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పుట్టినరోజైన మే15న కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరనుంది. కంఠీరవ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా సీఎం పదవి ఇస్తారా? లేదా? అనే సస్పెన్ష్ నెలకొంది. సీఎం రేసులో డీకేతో పాటు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య బరిలో ఉన్నారు. మరి సీఎం పదవి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.