కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా మతకల్లోలాలు, కర్ఫ్యూలే ఉంటాయని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కుటుంబ పాలన వస్తుందన్నారు. ఇండియా కూటమిలో ఐకమత్యం లేదన్నారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఓ ప్రధానమంత్రి మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీలతో ఎంఐఎం దోస్తి చేస్తుందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్ద తుగా ఇస్తున్నారని మండిపడ్డారు.


