ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు ఏఐసీసీ నేతలు. తెలంగాణలోని నాలుగు పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులపై చర్చించను న్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ, మరో నాలుగు పార్లమెంట్ నియోజకవ ర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో జరిగే సీఈసీ మీటింగ్‌కు హాజరవుతున్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు పెండింగ్ లో
ఉన్న వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సీఈసీ.. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించా ల్సిఉంది. ఈ రోజు జరిగే భేటీలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ నాలుగు స్థానాలపై ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్హరీశ్ చౌదరి నేతల అభిప్రాయాలను సేకరించారు. సీఈసీ భేటీలో ఈ నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయ నుండటంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు వరంగల్ నుంచి కడియం కావ్యకి టికెట్ కన్ఫర్మ్ చేయనున్నారు. ఇక, ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద రెడ్డి ప్రధానంగా పోటీపడుతున్నారు. ఇవాళ జరగనున్న మీటింగ్‌లో ఈ నాలుగు స్థానాలపై క్లారిటీ రానుంది.