భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదలను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోను రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారుచేశామని చెప్పారు. 4 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.


