స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. భారత్ జోడో యాత్ర ఫలితంతో కర్నాటక గెలుపొందిందని అన్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాలి.. జేడీఎస్ ఎటు వైపు ఉంటుందో.. బీజేపీతో జతకట్టమని చెప్తారా..?అంటూ ప్రశ్నించారు. అప్పుడు ఆయన మైత్రి ఏంటో బయట పడుతుందని వ్యాఖ్యానించారు.