ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశాన్ని అసెంబ్లీ లో టీడీపీ లేవనెత్తింది. ఇది రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదని అధికార వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఎమ్మెల్యేలు దీనికి ససేమిరా నో చెప్పడంతో టీడీపీ నిరసన చేపట్టింది. దీనిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.