భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, సీఎన్ఎన్ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురించి పలు విషయాలను నివేదిక వెల్లడించింది. భారత్‌ను ఆర్థికంగా అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ కీలక పాత్ర పోషించారని నివేదిక పేర్కొంది.
రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేల నిర్మాణానికి కోట్లాది రూపాయలను వెచ్చించి, మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేసిందని నివేదిక పేర్కొంది. డిజిటల్ కనెక్టివిటీని పెంచే దిశలో మోడీ ప్రభుత్వం కూడా మంచి పని చేస్తోందని నివేదిక పేర్కొంది. దీని కారణంగా వాణిజ్యం, రోజువారీ జీవితం చాలా మెరుగుపడుతోంది. దేశంలోని ఈ విప్లవం లో పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు ప్రధాన పాత్ర పోషించారని నివేదిక స్పష్టం చేసింది.
ఇటీవలి సీఎన్ఎన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం గురించి కూడా ప్రస్తా వించింది. ఈ పెళ్లికి ప్రపంచ నలుమూలల నుంచి కోటీశ్వరులు, సినీ తారలు తరలివచ్చారు. ఈ వివాహ వేడుకకు మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్ ఆధిపత్యం కనిపించిం దని నివేదిక పేర్కొంది. ముఖేష్ అంబానీ ఆశయం మరియు విస్తరణ వేగం అదానీతో సరిపోలుతున్నాయని నివేదిక వెల్లడిచేసింది. పోర్ట్‌లు మరియు పవర్ నుండి డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ వరకు వ్యాపారాలలో ఇప్పుడు అగ్రగామిగా నిలిచారు గౌతమ్ అదానీ. వాస్తవానికి ఆయన కాలేజ్ డ్రాప్-అవుట్. గౌతమ్ అదానీ వ్యాపారంపై ఆసక్తితో కేవలం రెండేళ్లలోనే కాలేజీ కి దూరమైన సంగతి తెలిసిందే.


