తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. కాసేపట్లో ముంబై ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్నారు. ముంబైలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, రూపొందించాల్సిన మేనిఫెస్టోపై సలహాలు, ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంతో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి
0
141
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


