స్వతంత్ర వెబ్ డెస్క్: మెదక్ జిల్లా పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్(Pragathi Bhavan) నుంచి బయల్దేరి వెళ్లారు. మెదక్ CSI చర్చి గ్రౌండ్‌లో లక్షమందితో జరగనున్న ప్రగతి శంఖారావం సభకు రోడ్డు మార్గాన గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా ముఖ్యంమత్రి కేసీఆర్ మెదక్ చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ. 3116 నుంచి రూ. 4116 కు పెంచిన పింఛన్‌ను, టెకేదార్ బీడీ కులవృత్తుల కార్మికులకు పింఛన్ పంపిణీ చేయనున్నారు.
మొదట మెదక్ జిల్లా BRS పార్టీ కార్యాలయం, జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం తన చేతులతో ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లను మంత్రి హరీశ్ పర్యవేక్షించారు. స్వయంగా సీఎం ప్రారంభోత్సవానికి వస్తుండటంతో జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. కలెక్టరేట్ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు సిబ్బంది.