స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్(CM Jagan) గుడ్‌న్యూస్ అందించారు. 2014 జూన్ 2కు ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను(contract employees) రెగ్యులరైజ్(Regularize) చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే దీనికి సంబంధించిన ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ పొందుపర్చింది. అందులో భాగంగా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్‌పై నాలుగు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదేళ్ల సర్వీస్ నిబంధనను ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది. ఐదేళ్ల నిబంధన తొలగింపుతో అదనంగా మరో నాలుగు వేల మందికి లబ్ధి జరగనుంది. ఐదేళ్ల సర్వీస్ నిబంధన కలిగి ఉండటం కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమస్యగా మారింది. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తివేయడం వల్ల మరింతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యే అవకాశం లభించింది.