ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో వైసీపీ ప్రచారంలో మరో ఘట్టం ముగుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర ఈనెల 24న ముగియనుంది. ఇప్పటి వరకు 67 అసెంబ్లీ నియోజక వర్గాల మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర నిర్విరామంగా కొనసాగింది. సీఎం జగన్ 2015 కిలోమీటర్లు బస్ యాత్ర చేశారు. 20 రోజుల్లో 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయింది సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 13వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగను న్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారంలో ఏపీ సీఎం జగన్ అన్ని పార్టీల కంటే జెట్ స్పీడ్ తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో సిద్దం పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా “మేమంతా సిద్ధం” పేరుతో బస్ యాత్ర చేస్తున్నారు. గత నెల 27న ఇడుపుల పాయ నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభమైంది ఇడుపుల పాయ లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనల అనంతరం సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభించారు. జగన్ బస్ యాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. విశాఖ జిల్లా తరువాత ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఈ నెల 24 తో బస్ యాత్ర ముగియనుంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ 20 రోజుల పాటు 21 జిల్లాల్లో యాత్ర కొనసాగించారు. యాత్ర 67 అసెంబ్లీ నియోజక వర్గాల లో పూర్తి అయింది. ఏకంగా 2015 కిలో మీటర్ల మేరకు బస్ యాత్ర సాగింది. జగన్ మోహన్ రెడ్డి బస్ యాత్ర జరుగుతుండగానే అయన పై హత్యాయత్నం జరిగింది. ఈ నెల 13న విజయవాడలో బస్ యాత్ర కొనసాగుతుం డగానే అయన పై రాయితో వేముల సతీష్ అనే వ్యక్తి దాడి చేశారు. దీంతో సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంలో గాయం అయింది. దాడి తరువాత ఒక రోజు బస్ యాత్ర కి విరామం ఇచ్చినా. తరువాత యాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ బస్ యాత్రలో అటు పార్టీ నేతలు,ఇటు సామాన్య ప్రజానీకంతో మమేకం అవుతున్నారు. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతు న్నారు. జిల్లా, ప్రాంతం అనే భేదం లేకుండా వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు బస్ యాత్రలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు.విశాఖ బస్ యాత్రలో భాగంగా సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై నేతలతో చర్చించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో లో దాదాపు తొంభై శాతం పైగా హామీలు అమలు చేశామని వైసిపి చెబుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో అమలు చేయకలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన పెన్షన్లు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలకు నిధులు పెంచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


