CM Jagan| ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5న పర్యటించనున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. అయితే సీతారాముల కళ్యాణోత్సవానికి ముందే సీఎం తిరిగి వెళ్లనున్నారు. 5వ తేదీన మధ్యాహ్నం గన్నవరం నుంచి కడపకు చేరుకొని మధ్యాహ్నం ఒంటిమిట్ట రామాలయం చేరుకుంటారు. అనంతరం స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం జగన్.