ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో సీఎం దిగగానే.. అక్కడ కూడా జై జగన్ నినాదాలు మారుమోగాయి. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ఫ్యాంట్ తో ఎయిర్ పోర్ట్ లో జగన్ నడుస్తూ వచ్చారు. ఆయన చేతిలో ఎరుపు రంగు స్వెట్టర్ ఉంది. చిరు నవ్వుతో జగన్ ఎయిర్ పోర్ట్ లో ఉల్లాసంగా కనిపిం చారు. కాగా, నిన్న కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్.ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు.