స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్ విజయవాడలోని మల్లాది విష్ణు నివాసానికి చేరుకుని ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం విష్ణు కుటుంబసభ్యులను పరామర్శించారు. జగన్ తో పాటు మంత్రి జోగి రమేశ్ కూడా విష్ణు తల్లి చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు.