ప్రకాశం జిల్లా మార్కాపురం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్(CM Jagan). గతంలో ఓ ముసలాయన ఉండేవారంటూ చంద్రబాబు(Chandrababu)పై విమర్శల పురాణం మొదలు పెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉండేవా? దోచుకో, దాచుకో, తినుకో అన్నది చంద్రబాబు విధానం అంటూ మండిపడ్డారు. మీ బిడ్డ జగన్(CM Jagan) పాలనలో ఎలాంటి వివక్ష, లంచాలు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశాడా? అంటూ ప్రశ్నించారు. ఇక ఈ పెద్దాయన టిడ్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి ఫేక్ ఫోటోలు దిగుతాడు. అక్కడికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ అని అంటాడు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు దిగడం కాదు చంద్రబాబు. ఒక అబద్ధాన్ని వంద సార్లు నిజమని చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారు. నిజం ఏంటో ప్రజలందరికీ తెలుసు. అందుకే నిజాలను దాస్తున్నారు అంటూ చంద్రబాబుపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read Also: ఏపీ మహిళలకు శుభవార్త… ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్..!
Follow us on: Youtube, Koo, Google News