ఇవాళ మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరుకానున్నారు. శాఖలవారీగా భవిష్యత్ ప్రణాళికలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు.. ఎన్నికల హామీల అమలుపై సమీక్షించనున్నారు. పాలన అంశాలు, ఏపీ బడ్జెట్‌పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.