25.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

దాడి ఘటనను ఖండించిన సీఎం చంద్రబాబు

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత యువతి, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.

గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో గణేశ్‌ అనే యువకుడు… బాధిత యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్‌ పోశాడు. గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏప్రిల్‌ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందినవాడిగా గుర్తించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్