సంక్రాంతి పండుగకు రాబోతున్న చిరంజీవి కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి చాలా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమా విశేషాలు చెబుతున్నారు. అలాగే పనిలో పనిగా పర్సనల్ విషయాలు కూడా చెబుతున్నారు. సహజంగానే తమ్ముడ పవన్ కల్యాణ్ కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న, ప్రతి ఇంటర్వ్యూలో ఆయన ఎదుర్కుంటూనే ఉన్నారు.
ఒకొక్కసారి చికాకు పడుతుంటారు. ఒకొక్కసారి ఇబ్బందిపడుతూనే సమాధానం చెబుతారు. ఒకొక్కసారి సరదాగానే చెబుతుంటారు. కానీ వాల్తేరు వీరయ్య ప్రమోషన్ సందర్భంగా మాత్రం భావోద్వేగానికి గురయ్యారు. నా తమ్ముడు గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారని వ్యాక్యానించారు. మరి అదేమిటో చూద్దామా…
సంక్రాంతికి విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్ వ్యూ లో చిరంజీవి మాట్లాడుతూ… సినిమా విషయాల తో పాటు ఫ్యామిలీ మాటర్స్ షేర్ చేశారు. ఈ సందర్భంగా పవన్ మీద జరుగుతున్న మాటల దాడి పై ఆవేదన వ్యక్తం చేశారు. అదే పనిగా విమర్శలు చేయటం తగని పని అని హితవు పలికారు.
పవన్ కల్యాణ్ తమ్ముడు కాదని, బిడ్డ లాంటి వాడని తెలిపారు. డబ్బు, పదవుల మీద పవన్ కు ఎన్నడూ వ్యామోహం లేదని తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, ప్రజలకు ఏదో మంచిచేయాలనే సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ను కొంతమంది ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని, అటువంటివి విన్నప్పుడల్లా మనస్సు చివుక్కుమంటుందని తెలిపారు. అటువంటి విమర్శలు తట్టుకోవటం కష్టమని అన్నారు.
మరో వైపు కుమారుడు రామ్ చరణ్ , ఉపాసన ఇద్దరూ కూడా తమతో చాలా ఆత్మీయంగా ఉంటారని వివరించారు. తండ్రి కాబోతున్నట్లుగా రామ్ చరణ్ చెప్పిన వెంటనే కన్నీళ్లు వచ్చేశాయని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు. ఆ శుభవార్త చెప్పేందుకు కొడుకు-కోడలు ఇద్దరూ స్వయంగా ఇంటికి వచ్చారని, ఆ శుభవార్తను తాను, సురేఖ పంచుకొన్నామని వివరించారు. మూడో నెల వచ్చే వరకు ఆగి, అప్పుడు అందరితో పంచుకున్నామని చిరంజీవి వివరించారు.
మొత్తానికి కుటుంబంలోని ముఖ్య సభ్యులతో ఉన్న అనుబంధాన్ని ఆత్మీయంగా పంచుకొన్నారు. మెగా ఫ్యామిలీ లోని ముఖ్యమైన హీరోలు, వారి మధ్య అనుబంధాలను సున్నితంగా ప్రస్తావన చేస్తూ వాల్తేరు వీరయ్య సినిమా విశేషాలు వెల్లడిం