31.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

Chinmayi Sripaada: లోన్ యాప్‌లు మార్ఫింగ్ ఫోటోలతో మహిళల్ని వేధిస్తున్నాయి..

స్వతంత్ర వెబ్ డెస్క్: నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో (Morphing Video)ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై పలువురు స్టార్స్‌ ఇప్పటికే మండిపడిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగచైతన్య సహా పలువురు ఇప్పటికే రష్మికకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) కూడా మార్ఫింగ్‌ వీడియో ఘటనపై ఫైర్‌ అయ్యారు. లోన్ యాప్‌ల ఏజెంట్లు మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని, ఏఐ టెక్నాలజీని(AI technology) దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స‌మాజంలో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై సోష‌ల్‌మీడియా(Social Media) వేదిక‌గా త‌ర‌చూ గ‌ళం విప్పుతూ ఉంటుంది చిన్మయి‌. మ‌హిళ‌ల‌పై జ‌రిగే లైంగిక వేధింపులు(Sexual Harassment), అఘాయిత్యాల‌పై ఎక్స్(ట్విట్టర్) వేదిక‌గా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రష్మిక(Rashmika )కు సైతం చిన్మయి(Chinmayi ) మద్దతుగా నిలుస్తూ ట్విట్టర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. ‘డీప్‌ఫేక్‌ వీడియో(Deep Fake Video) రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చూశాను. ఆ వీడియోతో నిజంగా రష్మిక కలవరపడినట్టు తెలుస్తోంది.

 ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్న దేశంలో.. అమ్మాయిలను వేధించేందుకు ఇలాంటివి ఓ సాధనంగా మారుతున్నాయి. వారిని భయపెట్టేందుకు, బ్లాక్‌మెయిల్‌(Blackmail) చేసేందుకు, లైంగికంగా దాడి చేసేందుకు కూడా డీప్‌ఫేక్స్‌ ఓ ఆయుధంగా మారబోతోంది. అమ్మాయిల గౌరవానికి ప్రమాదంగా మారిన ఏఐ(AI), డీప్‌ ఫేక్‌ లాంటి వాటిపై అవగాహన లేని చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లోని కుటుంబాల పరిస్థితి ఊహకందనిది’ అని పేర్కొన్నారు.

ఇటీవలే ఒకప్పటి ప్రముఖ స్టార్‌ నటి సిమ్రన్‌(Simran) మీద కూడా ఇలానే ఏఐ వీడియో(AI Video) వచ్చిందని ఈ సందర్భంగా చిన్మయి గుర్తు చేశారు. కొందరు జైలర్‌ చిత్రంలోని ‘కావాలయ్యా..’ పాటకు సిమ్రన్‌ ముఖాన్ని ఏఐ సాయంతో మార్ఫింగ్‌ చేసిన వీడియోను నటి సోషల్‌ మీడియా(Social Media)లో పోస్టు చేస్తే గానీ మనకు తెలియదని అన్నారు. ఇలాంటి ఏఐ(AI), డీప్‌ఫేక్‌(Deep Fake), సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసేలా సాధారణ ప్రజలు, బాలికలకు అవగాహన కల్పించడానికి దేశ వ్యాప్త ప్రచారాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చిన్మయి(Chinmayi) అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో మార్ఫింగ్‌ ఫొటోలతో అమ్మాయిలను, మహిళా రుణ గ్రహీతను వేధిస్తున్న లోన్‌ యాప్స్‌(Loan Apps) వాళ్ల అరాచకాలను కూడా ప్రస్తావించారు. లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకున్న మహిళల ఫొటోలను పోర్న్ ఫొటోలకు జతచేసి బ్లాక్ మెయిల్(Blackmail) చేస్తున్నారు. వాటి ద్వారా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని చిన్మయి(Chinmayi) ఆరోపించారు. ఇప్పుడు డీప్‌ఫేక్(Deep Fake) అనేది భయంకరంగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది అని అన్నారు.

అదేంటంటే, రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో(Deep Fake Video) ఒరిజినల్ వీడియో బ్రిటీష్ ఇండియన్ జారా పటేల్(Zara Patel). జరా లిఫ్ట్‌లోకి దిగిన వీడియో అది. అందులో జరా పటేల్ ముఖానికి రష్మిక ముఖాన్ని జోడించారు. చాలా మంది ఇది రష్మిక మందన్న(Rashmika Mandanna) అని అందరూ అనుకుంటున్నారు. జారా మార్ఫింగ్ వీడియో(Morphing video)పై రష్మిక మందన్న(Rashmika Mandanna) స్పందిస్తూ.. ఈ వీడియోను షేర్ చేయడానికి, దాని గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. డీప్ ఫేక్ వీడియో(Deep fake video) ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇది నాకే కాదు.. ప్రతీ మహిళ ఆందోళన చెందాల్సిన విషయంగా మారింది. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం దారుణంగా అనిపిస్తుంది అని రష్మిక సోషల్ మీడియాలో స్పందించారు.కేవలం రష్మిక ఒక్కరే కాదు. కత్రినా కైఫ్ ఫోటోలను కూడా ఇలానే మార్చారు సైబర్ నేరగాళ్లు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్