ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ చెన్నైతో బెంగళూరు తలపడుతుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్‌కు చేరకుంటుంది. అలా కాకుండా బెంగళూరు జట్టు గెలిస్తే మాత్రం రేపు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్లేఆఫ్ స్థానం ముడిపడి ఉంటుంది. అందుకే ఈరోజు మ్యాచ్ కీలకమని చెప్పాలి. ఇరుజట్లకు కావాల్సినంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వర్షం కారణంగా రద్దయితే చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్లేఆఫ్ చేరే ఛాన్స్‌లున్నాయి. ఇరు జట్లు బలంగా ఉండటంతో మ్యాచ్ చూసే క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగే అవకాశం ఉంది.ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు ప్లేఆఫ్ కు చేరుకున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ మూడు అగ్రస్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానం కోసం నేడు పోటీ జరగనుంది. దాదాపు అన్ని జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాయి. ఒక్క చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం తమ అదృష్టాన్ని ఇంకా పరీక్షించుకుంటున్నాయి.