28.8 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

చేగువేరా వర్ధంతి సందర్భంగా ‘చే’ టీజర్ రిలీజ్!

తెరపై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం “చే”. లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది.. ఇటీవలే చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు.. అక్టోబర్ 9 న క్యూబా పోరాటయోధుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా చిత్రయూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.

అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ… “విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం” అని చెప్పారు. “ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. ..ఆ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది…అక్టోబర్ 9 న విప్లయోధుడు చేగువేరా గారి వర్ధంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చెయ్యడం గర్వంగా ఫీల్ అవుతున్నాము అన్నారు.. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న మా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది.. నవంబర్ లో మా చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు..

నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్, తదితరులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు : సూర్య , బాబు , దేవేంద్ర
కో డైరెక్టర్ : నాని బాబు
రచయిత, దర్శకుడు : బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్ : నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్ : వివ రెడ్డి పోస్టర్స్
D O P : కళ్యాణ్ సమి, జగదీష్
ఎడిటర్ : శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పీఆర్వో : దయ్యాల అశోక్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్