స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, చంద్రయాన్-3ని మరింత సమర్థంగా తీర్చిదిద్దామని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2 ల్యాండర్ మాడ్యూల్‌ను సక్సెస్ బేస్డ్‌గా డిజైన్ చేశామని.. కానీ చంద్రయాన్-3ని మాత్రం ఫెయిల్యూర్ బేస్డ్ అనాలసిస్‌తో రూపొందించామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. అంటే, చంద్రయాన్ 2 డేటాను అనాలసిస్ చేసుకుని, ఎలాంటి అవాంతరాలు ఏర్పడతాయో ముందుగానే ఊహించి, దానిని అనుగుణంగా ల్యాండర్ మాడ్యూల్ నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేలా ఏర్పాట్లు చేశారు.
ల్యాండర్ మాడ్యూల్ కూడా చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా నాలుగు కిలోమీటర్ల పొడవు… 2.4 కిలోమీటర్ల వెడల్పు ఉన్న అనువైన ప్రాంతాన్ని ముందుగానే గుర్తించి, అందులో సమతలంగా ఉన్న ప్రదేశంలోనే ల్యాండయ్యేలా చేశారు. దీనికి తోడు,సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఏడు రకాల అత్యాధునిక పరికరాలను కూడా అందులో అమర్చారు. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో… చంద్రయాన్-3 ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి మానవ నిర్మిత ప్రోబ్‌గా చరిత్ర సృష్టించబోతోంది.