22.5 C
Hyderabad
Sunday, February 22, 2026
spot_img

నేడు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయనున్న చంద్రబాబు

   ఏపీలో తిరుగులేని మెజార్టీతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటకు సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మంత్రు లుగా ఎవరు ఉండబోతున్నారు. మంత్రి వర్గ కూర్పు ఎలా ఉండబోతోంది.ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగు తోంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కేబినెట్‌లో ఎన్ని పదవులు ఇస్తారు. ఎవరు ఏం తీసుకుంటా రనేదానిపై ఆస్తకికరంగా మారింది.

   టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఈసారి మంత్రివర్గంలో చేరతారని తెలుస్తోంది. 21కి 21 స్థానాలను గెలుచుకున్న జనసేన ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది? అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజారిటీ లతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకూ పోకుండా క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువ గా మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. రాయలసీమలో మాధవీరెడ్డి, సింధూరరెడ్డి,సవిత లాంటి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ, నెలవల విజయశ్రీ, ఎస్టీల నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి విజయం సాధించారు. బీసీల నుంచి గళ్లా మాధవి, యనమల దివ్య, సవిత వంటి వారున్నారు. వీరిలో ఒకరిద్దరికి అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది.

   టీడీపీలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయ నగరం నుంచి కోండ్రు మురళీమోహన్, ఆర్‌.వి.ఎస్‌.కె.రంగారావు, కళా వెంకటరావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామ కృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, శ్రీరాం తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారా యణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి .

 ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బి.ఎన్‌.విజయ్‌కుమార్, డోలా బాల వీరాంజ నేయస్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్‌రెడ్డితోపాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలన లోకి తీసుకునే అవకాశముంది. అనంత పురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్‌ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పు చేర్పులు ఉండొచ్చు.

21 స్థానాలు గెలుచుకున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌  ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. జనసేన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్ర వర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్ఠంగా నలుగు రికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్‌ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలినవాటికి కాపు, బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా.. గరిష్ఠంగా ఇద్దరికే చోటు లభించొచ్చు. వీటికి సీనియర్‌ నేతలు సుజ నాచౌదరి, కామి నేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో, ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్నిబట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలూ ప్రభావిత మవుతాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్