టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. నిన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు. నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మంత్రి వర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయను న్నారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనేదానిపై ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. అనుభ వం, వివిధ సామాజికవర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. రేపటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


