25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

చంద్రబాబు నాయుడి గారికి అత్యవసర వైద్యం అవసరం- నారా బ్రాహ్మణి

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల, ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్ తో బాధపడుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, నారా బ్రాహ్మణి నేడు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘గుండె తరుక్కుపోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తగిన సదుపాయాల్లేని, అపరిశుభ్ర కారాగార పరిస్థితుల మధ్య నిర్బంధంలో ఉన్నారు. అది ఆయన ఆరోగ్యానికి ఆందోళనకర రిస్క్ ను తీసుకొస్తుంది. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేసినందున అత్యవసర వైద్య పర్యవేక్షణ అవసరం ఇప్పుడు ఏర్పడింది. సకాలంలో వైద్య సంరక్షణ అందించడం లేదు. ఆయన 5 కిలోల మేర బరువు తగ్గారు. మరింత బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. ఆయన ఆందోళన గురించి మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం’’ అని బ్రాహ్మణి తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్