ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ వ్యవస్ధలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన సర్పంచులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వంలో వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని.. పనులకు బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. జగన్ ను గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ బహిరంగంగా చెప్పుతో కొట్టుకున్నారంటే సర్పంచుల పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చన్నారు.
ఈ క్రమంలో వాలంటర్లీ వ్యవస్థపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటర్లీకు తాను వ్యతిరేకంగా కాదని.. కానీ ప్రజాధనం జీతంగా తీసుకుటూ వైసీపీకి సేవ చేయడంపై మండిపడ్డారు. ఇంటి యజమానుల పర్మిషన్ లేకుండా జగన్ స్టిక్కర్లను అతికించడం నేరమన్నారు. అలాంటి తప్పులకు వాలంటీర్లు పాల్పడకుండా ఉండాలని సున్నితంగా చంద్రబాబు హెచ్చరించారు.