23.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

Ambati Rambabu : చంద్రబాబు నటనలో ఎన్టీఆర్ నే మించిపోయాడు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అన్నీ అబద్ధాలేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.  కాపర్ డ్యాంలు, స్పిల్ వే నిర్మాణం పూర్తికాకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారని ఆరోపణలు చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టుల గురించి క్షణం కూడా ఆలోచించలేదేమని అంబటి ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి అంబటి చంద్రబాబుకు కౌంటర్‌గా మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చంద్రబాబు ఆస్కార్ లెవల్ లో నటించారని ఎద్దేవా చేశారు. మహానటుడని ఎన్టీఆర్‌ను అంటుంటారు కానీ తన జీవితంలో చంద్రబాబులా నటించిన వారిని ఇప్పటి వరకూ చూడలేదని మంత్రి అన్నారు.  అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందని విమర్శించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక్క క్షణం కూడా ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించలేదేమని నిలదీశారు.

పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పందించారు. మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఏర్పడేనాటికి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందనే వివరాలను మంత్రి అంబటి ఈ ప్రజెంటేషన్ లో వివరించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా రెండు కాపర్ డ్యాంలు, స్పిల్ వే, డయాఫ్రం వాల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని గుర్తుచేశారు. కృత్రిమంగా నదిని సృష్టించాలని, దాని కోసం భూమిని తవ్వాలని చెప్పారు. ఇదంతా పూర్తిచేసి, కాపర్ డ్యాంల నిర్మాణం కూడా పూర్తయ్యాక నిర్మించాల్సిన డయాఫ్రం వాల్‌ను చంద్రబాబు తొందరపడి ముందే కట్టించారని విమర్శించారు. స్పిల్ వేలో కూడా ఒక్క గేటు మాత్రమే.. అది కూడా ఇంటి నిర్మాణంలో పునాదులు లేపిన తర్వాత గుమ్మాలు పెట్టినట్లు పెట్టించారని మండిపడ్డారు. చుట్టూ వాల్ లేకుండా రెండు పిల్లర్లు లేపి మధ్యలో గేటు పెట్టించి ప్రాజెక్టు పూర్తిచేశామని భజన చేసుకున్నారని విమర్శించారు.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్