స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. తాజాగా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అంగళ్ళు కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే లక్ష రూపాయల పూచికత్తుతో చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇస్తున్నట్టు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే 70 మందికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఫైబర్ నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పిటి వారంటును విజయవాడ ఏసిబి కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.