స్వతంత్ర వెబ్ డెస్క్:టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన నేపథ్యంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘మెగా లిటిల్ ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో కోట్ల మంది మెగా అభిమానులకు ఆనందాన్ని పంచావు. రామ్ చరణ్, ఉపాసనలను తల్లిదండ్రులను చేశావు.. మమ్మల్ని గ్రాండ్ పేరంట్స్‌ను చేశావు. ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక చరణ్ ను సోదరుడిగా భావించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకు కంగ్రాట్యులేషన్స్ అని ట్వీట్ చేశారు. పేరెంట్స్ క్లబ్ కు స్వాగతం పలికారు. కూతురుతో గడిపే ప్రతి క్షణం జీవిత కాలమంతా మరిచిపోలేని మధురమైన జ్ఞాపకమేనని చెప్పారు. చిన్నారికి, మీకు అంతులేని సంతోషాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
ఇక మంచు మనోజ్, మంచు లక్ష్మి, సాయి ధర్మ తేజ్ ఉపాసన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మి దేవి పుట్టిందనే వార్త చాలా సంతోషాన్ని ఇచ్చిందని లక్ష్మి ట్వీట్ చేయగా, తల్లితండ్రులైన చెర్రీ, ఉపాసన జంటకి మంచు మనోజ్, సాయి ధర్మ తేజ్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు. తల్లితండ్రులైన ఉపాసన, రామ్ చరణ్ కి కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. ‘లిటిల్ ప్రిన్సెస్ ను పొందిన అందమైన జంటకి అభినందలు. మీ బేబీ ఇప్పటికే మీతో ప్రయాణం మొదలు పెట్టింది. చిన్నారికి మీకు ప్రేమ, ఆనందం దక్కాలని కోరుకుంటున్నాను’ అని లావణ్య ట్వీట్ చేసారు.