Delhi CM Kejriwal | ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తులో భాగంగా నిన్న సాక్షిగానే సీఎం కేజ్రీవాల్ ను విచారించింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ.. రాత్రి 8.30 గంటలకు ముగిసింది. విచారణ అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
దాదాపు 9 గంటల పాటు నన్ను సీబీఐ ప్రశ్నించిందనిఅన్నారు. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. లిక్కర్ స్కాంలో అన్నీ తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆప్ ‘కత్తర్ ఇమాందార్ పార్టీ’. ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ అనుకుంటున్నారని.. కానీ దేశప్రజలంతా మావైపే ఉన్నారని అన్నారు. అసలు మద్యం కుంభకోణం అనేదే లేదని.. ఇదంతా కావాలనే చేస్తున్నారని అన్నారు. కాగా కేజ్రీవాల్ విచారణను సీసీ కెమెరా పర్యవేక్షణలో సీఆర్‌పీసీ 161 కిందస్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అంతేకాకుండా లిఖితపూర్వకంగా కూడా స్టేట్‌మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.