25 C
Hyderabad
Thursday, July 31, 2025
spot_img

ఆగస్ట్ 15లోగా సీఎం రేవంత్ రుణమాఫీ అమలు చేయగలరా ?

భూమి, ఆకాశం తల్లకిందులైనా సరే.. రైతు రుణమాఫీని ఆగస్ట్ 15లోపు అమలు చేసి తీరతామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మరి.. ప్రభుత్వం చెప్పినట్లుగా రానున్న ఆగస్ట్ 15లోగా మాఫీ జరుగుతుందా? లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ప్రభుత్వం. మాఫీ విషయంలో మాట తప్పు తుందా? అసలు ఈ భారీ పథకం కోసం ఎంతమేర నిధులు ఖర్చవుతాయి? తెలంగాణలోని మేధావులే కాదు.. సామాన్య ప్రజానీకంలో సైతం ఇప్పుడు దీనిపైనే చర్చ సాగుతోంది.

పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావడంతో రైతు రుణమాఫీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అధికారులతో సమావేశమైన ఆయన ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకునే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రుణమాఫీ కోసం ఎంత మేర నిధులు ఖర్చవుతాయి. వాటిని ఎలా సమకూర్చుకోవాలి అన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఓ అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతు రుణమాఫీకి 33 వేల కోట్ల నుంచి 35 వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవు తాయని తెలుస్తోంది. అయితే ఈ భారం ఎంత ఎక్కువైనా హామీని అమలు చేయాల్సిందేనని, అందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా అధికారులు కసరత్తులు మొదలు పెట్టిన ట్లుగా ప్రచారం సాగుతోంది. నిజానికి తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించింది. ఆగస్ట్ 15లోగా ఈ హామీని నెరవేరుస్తామని ఇటీవలె నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ ప్రముఖంగా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై ప్రతిపక్షాలు సైతం ప్రశ్నాస్త్రాలు సంధిం చాయి. ప్రభుత్వంపై సెటైర్లు వేశాయి.

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సీఎం రుణమాఫీపై అధికారులతో సమావేశం కాగా.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, ఖర్చు, రుణాలకు ప్రతినెలా చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఇలా అన్ని అంశాలను వివరించడంతోపాటు రుణమాఫీకి ఎంత అవసరమో కూడా స్పష్టత ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. రేవంత్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రైతు రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా అమలు చేసే విధానంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. బ్యాంకులు రుణమాఫీ అమలు చేస్తే, ఆ మొత్తాన్ని ప్రతి నెలా కొంత మొత్తంలో తెలంగాణ సర్కారు బ్యాంకులకు చెల్లించే విధానాన్ని అమలు చేయాలన్నది ఓ ప్రతిపాదన. రాష్ట్రంలో పెరిగిన ఆదాయాన్ని, అదనంగా సేకరించే నిధులను దీనికి ఖర్చుచేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇలాంటి ప్రతిపాదనలను రిజర్వ్ బ్యాంక్ అంగీక రించకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఈ భేటీలో అధికారులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతి పాదనపై స్థానిక బ్యాంకులతో చర్చించాలని, వీలు కాకుంటే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిం చాలంటూ సూచించారు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ హామీ మాత్రం నిలబెట్టుకోవాల్సిందే నని తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే అదనపు ఆదాయం సమీకరించుకునేందుకు భూముల విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలను మరింత సవరించి ఎక్కువగా ఆదాయం వచ్చేలా చూడాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో.. ఆ దిశగానూ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

మరోవైపు.. ఇప్పటికే రైతు రుణమాఫీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల హామీలో భాగంగా ఆగస్ట్ 15 నాటికి రుణమాఫీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే.. దీనికి గట్టిగానే కౌంటరిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి, ఆకాశం తల్లకిందులైనా ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ హరీష్ రావుకు ప్రతిసవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం ఎలా ఉన్నా.. ఆగస్ట్ 15 లోగా సీఎం రేవంత్ రెడ్డి… రైతు రుణ మాఫీ అమలు చేస్తారా ? అందుకు రాష్ట్ర పరిస్థితులు సహకరిస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా కన్పిస్తోంది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..!

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్