ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. నేటితో ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. నేటి సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ సమయం ఇచ్చింది. నామినేషన్లను ఈసీ రేపు పరిశీలించనుంది. ఈ నెల 20 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఢిల్లీలోని 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించనుంది ఈసీ.