కొన్ని రకాల మందుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించి 36 ప్రత్యేక మందులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ పూర్తిగా తొలగిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జె్ట్ ప్రసంగంలో తెలిపారు. అందువల్ల ఈ మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అందువల్ల దీర్ఖ కాలిక వ్యాధులతో బాధపడే రోగులకు ఈ నిర్ణయం కొంత ఊరటగా ఉంటుంది.
కన్సెషనల్ కస్టమ్స్ డ్యూటీ ఉన్న 6 లైఫ్ సేవింగ్ మందులపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని కూడా పూర్తిగా తొలగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మందుల బల్క్ డ్రగ్ తయారీపై కూడా ఇది అప్లై అవుతుందని మంత్రి వివరించారు. అలాగే సర్జికల్ పరికరాల ధరలు తగ్గనున్నాయి. మరోవైపు అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025-26లోనే 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి వెల్లడించారు.