కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా గురజాడ సూక్తితో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశమంటే మట్టి కాదోయ్ .. దేశమంటూ మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని తన ప్రసంగంలో తొలి వాక్యాల్లో ప్రస్తావించారు.
అంతకు ముందు విపక్షాలు లోకసభలో నిరసనలు తెలిపాయి. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా తొక్కిసలాటపై చర్చించాలని పట్టుబట్టాయి. విపక్ష నేతలు సంయమనం పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వినలేదు. అనంతరం విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గందరగోళం మధ్యే బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు