ఎన్నికల ముందు జనసేనకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. జనసేన గ్లాసు గుర్తు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బకెట్ గుర్తు సరిగ్గా పోలి ఉండడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. దీంతో ఎన్నికలప్పుడు EVMలలో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ ఉంటుందని జనసేన వర్గాలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే అభ్యర్థుల పేర్లు కూడా ఒక్కటే కావడం మరింత ఆందోళనకు గురిచేసే అంశంగా స్థానికంగా చర్చ జరుగుతోంది.
నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బకెట్ సింబల్ తో తన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. పిఠాపురంలో కె. పవన్ కల్యాణ్, తెనాలిలో ఎన్. మనోహర్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అనే అభ్యర్థులను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి పెడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుతోనే మరో వ్యక్తిని బరిలోకి దించడం..అలాగే ఇతర నేతల పోటీ చేసే స్థానాల్లో కూడా అవే పేర్లతో పోటీ చేయించడం చూస్తుంటే కచ్చితంగా ఇందులో కుట్రకోణం ఉందని జనసేన నేతలు అంటున్నారు.అయితే గ్లాసు గుర్తు పోలిన బకెట్ గుర్తు జనసేనపై ఎంతో కొంత ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జన సేన అభ్యర్థుల పేర్లతోనే బకెట్ గుర్తు అభ్యర్థులు కూడా బరిలో ఉండడంపైన కూడా వారు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. అటు జనసైనికులు కూడా ఇదంతా వైసీపీ ప్లాన్ అని మండిపడుతు న్నారు.