వ్యక్తిగత ఆదాయపన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నాగా ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
పన్ను సంస్కరణల్లో కీలక ముందడుగు పడింది. వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తామన్నారు.
కొత్త పన్ను శ్లాబుల సవరణ
4 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి మినహాయింపు, రూ.4 నుంచి 8 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.8 నుంచి 12 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.20 నుంచి 24 లక్షల వరకు 25 శాతం పన్ను ఉంటుంది. ఆదాయం రూ.24 లక్షల పైబడితే 30 శాతం పన్ను ఉంటుంది.