స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ కమెడీయన్ బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె అయిన డాక్టర్.ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకలో ఇరు కుటుంబసభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు గౌతమ్ పలు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. రెండో కుమారుడు సిద్దార్థ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో నూతన జంటకు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.