స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. మొత్తం యాక్షన్ సన్నివేశంతో కూడిన టీజర్ చూడగానే బోయపాటి మార్క్ మాస్ మసాలా పుష్కలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ‘నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా.. నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా.. నీ పవర్ దాటలేను అన్నావ్ దాటా.. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్’ అంటూ రామ్ చెప్పే డైలాగ్ మాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టాడు. మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే రామ్ ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద చిట్లూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.