విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanaryana)స్పష్టంచేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనేది మా నినాదమన్నారు. ప్రైవేటీకరణ ఆపాలని తాము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్(BRS)పార్టీ వల్లే ప్రైవేటీకరణ తాత్కాలికంగా ఆగిపోయిందనే ప్రచారంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, జనసేన(Janasena)పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
అలాగే కోడికత్తి(Kodikathi)కేసుకు సంబంధించిన NIA రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. 2003లో అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేయడం వెనక కూడా రాజకీయ లబ్ధి ఉందా? అని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాస్ వెనక ఎవరున్నారో తేలాలని.. ఈ కేసులో సమగ్ర విచారణ జరగాలన్నదే వైసీపీ డిమాండ్ అన్నారు బొత్స.