ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సీఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అలాగే టీచర్స్, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. టీచర్ల బదలీలకు పారదర్శకమైన విధానం తీసుకువస్తామని.. కాంట్రాక్డ్ ఉద్యోగులనూ రెగ్యూలర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 10వేల ఖాళీలను గుర్తించినట్లు బొత్స వెల్లడించారు. ఒంటిపూట బడుల వల్ల తాత్కాలికంగా రాగి జావా స్థానంలో చిక్కీలు అందిస్తున్నామని చెప్పారు.