దేశ రాజధానిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. మథురా రోడ్డులో ఉన్న ఈ స్కూలు ఈమెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపుల మెజేజ్ వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే సిబ్బంది, విద్యార్ధులను స్కూలు నుంచి బయటకు పంపించేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు బయటపడలేదు. దీంతో ఈమెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నారు. గతంలో రెండు వారాల క్రితం కూడా ఓ ప్రముఖ స్కూలు ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వచ్చాయి.