ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్‌ఎన్ రెడ్డి ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు HMDA చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌కు నోటీసులు ఇవ్వడంతో ఆయన బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిధుల బదలాయింపులో అర్వింద్ కుమార్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు HMDA చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అర్వింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం అర్వింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు.