మల్కాజ్‌గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్. హయత్ నగర్‌లోని బంజారా కాలనీలో స్థానిక కార్పోరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి పర్యటించారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వృద్ధులకు 4వేలు, వికలాంగులకు 6వేల రూపా యలు పెన్షన్ ఇస్తామని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చ కపోగా రేవంత్ మొఖం చాటేశారన్నారని విమర్శించారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.