స్వతంత్ర వెబ్ డెస్క్: పురందేశ్వరి బీజేపీలో చేరి ఆ పార్టీని టిడిపికి తాకట్టు పెట్టేందుకు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆమెకు బిజెపిపై అభిమానం లేదన్నారు. ఆమె పార్టీలో చేరాక ఒక్క ఓటయినా అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. మొదట టిడిపి, తర్వాత ఎన్టీఆర్ టిడిపి, మళ్లీ బిజెపి, కొన్నాళ్లకు కాంగ్రెస్, మళ్ళీ ఇప్పుడు బిజెపిలో చేరి నాలుగు సార్లు పార్టీ మారిన చరిత్ర పురందేశ్వరిదని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ?హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? అని ఆగ్రహించారు. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే…ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుందన్నారు.