Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

పవన్ కు తిరుగులేని ఆఫర్ ఇవ్వాలని డిసైడ్ అయిన బిజెపి

      అదృష్టం కలిసి రావాలే కానీ అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. ఎవరూ ఊహించని పరిణామాలు అమాంతం జరిగిపోతాయి. ఏ మాత్రం బలం లేని చిన్న పార్టీ నేత ముఖ్యమంత్రి అయిపోయిన సంద ర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఓ రాజకీయ అద్భుతం జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబరాలు చేసుకునేంతటి గుడ్ న్యూస్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే కనక నిజమైతే తన అన్న మెగాస్టార్ చిరంజీవికి దక్కిన భాగ్య మే పవన్ కళ్యాణ్ కు కూడా సొంతం అవుతుందని వారంటున్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవ లేదని సెటైర్లు వేసే వాళ్ల దిమ్మతిరిగేలా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఉండబోతోందని హస్తిన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

      ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇపుడో కొత్త వార్త హల్ చల్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం పవన్ కళ్యాణ్ ను ముందుగా రాజ్యసభకు పంపి ఆ తర్వాత కేంద్రమంత్రిని చేస్తారని అంటున్నారు. యూపీయే హయాంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించింది. ఆయన పర్యాటక శాఖ మంత్రి అయ్యారు రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరమయ్యారన్నది వేరే విషయం. ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా త్వరలో కేంద్ర మంత్రి కావడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు.

         ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయంగా బలోపేతం కావాలని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ జనాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ ను ఇప్పటికే చేరదీసింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. నాలుగున్నరేళ్లుగా బిజెపితో స్నేహంతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లోనూ జనసేనతో పొత్తు కొనసాగుతుందని కమలనాథులు పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానంటు న్నారు. అందుకోసం టిడిపి-బిజెపిలతో కలిసి జట్టుకట్టి 2014 ఫార్ములాని రిపీట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే టిడిపితో పొత్తుకు బిజెపి అగ్రనేతలు ససేమిరా అంటున్నారు.

      బిజెపి నాయకత్వం టిడిపిని దూరం పెట్టినా టిడిపితో పొత్తుకు ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారీ బిజెపి అగ్రనేతలతో భేటీ అయినపుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని చెబుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక వేళ టిడిపితో పొత్తుకు బిజెపి చివరి నిముషం వరకు కూడా ఒప్పుకోకపోతే టిడిపి-జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బిజెపి నాయకత్వం పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తమ మిత్రుడేనని పదే పదే గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-బిజెపి కలిసే ఎన్నికల బరిలోకి దిగుతాయని కూడా కమలనాథులు అంటున్నారు.

     పవన్ కళ్యాణ్ తో పొత్తు లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిడిపికి చాలా కష్టం. అందుకే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో అనుబంధం కోసం తాపత్రయ పడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ తో వన్ టూ వన్ భేటీలు కూడా నిర్వహించారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సమయంలోనే టిడిపి-జనసేనల పొత్తు ఖాయమన్న ప్రచారం మరింత ఊపందు కుంది. పొత్తులో భాగంగా గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల వరకు పొత్తుల గురించి కానీ సీట్ల సర్దుబాటు గురించి కానీ ఎవరూ మాట్లాడవద్దని జనసైనికులను ఆదేశించారు. అది చాలా వ్యూహాత్మకం గా చేసిన ప్రకటన అంటున్నారు రాజకీయ పండితులు.

       చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను విడిచి పెట్టే ప్రసక్తి లేదని భావిస్తోన్న బిజెపి నాయక త్వం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలంటే టిడిపిని ఇంటికి పంపేయాలని భావిస్తోంది. అది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేనల మధ్య పొత్తు లేకుండా చూడాలన్నది కమలనాథుల వ్యూహంగా చెబుతున్నారు. అది నిజం చేసుకోవాలంటే పవన కళ్యాణ్ అభిమానులను ఆనంద పర్చేలా.. పవన్ కళ్యాణ్ కు గౌరవం పెంచేలా కీలక నిర్ణయం తీసుకోవాలని బిజెపి నాయకత్వం భావిస్తోందంటున్నారు. అందులో భాగంగానే త్వరలోనే పవన్ కళ్యాణ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని బిజెపి భావిస్తోన్నట్లు హస్తిన వర్గాల భోగట్టా. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిపించి ఈ బంపర్ ఆఫర్ గురించి చెప్పాలని బిజెపి నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా అంతర్ధానం అయిపోయే టిడిపిని పనిగట్టుకుని బతికించి నట్లు అవుతుందన్నది బిజెపి భావన. అందుకే టిడిపికి చెక్ చెప్పడానికి ఇదే మంచి అదనుగా ఆ పార్టీ భావిస్తోంది. బిజెపి చరిత్ర గురించి తెలిసిన వారు కూడా బిజెపి ప్రతీ రాష్ట్రం లోనూ తమ మిత్రపక్షాలతో ఎక్కువ కాలం కలిసి లేదని అంటున్నారు. ఏపీలోనూ ఎక్కువకాలం పొత్తులు పెట్టుకున్న టిడిపి స్థానంలో తామే ప్రధాన ప్రతిపక్షం కావడానికి బిజెపి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

       మహారాష్ట్రంలో శివసేనతో చాలా కాలం కలిసి ఉంది. ఆ తర్వాత అదే శివసేనను నిలువునా చీల్చి అక్కడ బిజెపి ఎదిగింది. పంజాబ్ లో అకాలీ దళ్ తోనూ అదే అనుభవం. బెంగాల్ లో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు బలహీన పడగానే తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా అవతరించేసింది బిజెపి. తమిళనాడులో కూడా అన్నాడిఎంకే తో ఇటువంటి రాజకీయాలే చేస్తోంది. దీన్నే ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. అందుకే జనసేనను అమ్ముల పొదిలో పెట్టుకుని టిడిపిని కొట్టేయాలన్నది బిజెపి ఎత్తుగడగా చెబుతున్నారు.టిడిపి నుండి పవన్ కళ్యాణ్ ను దూరం చేయడానికే కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ గా ఇవ్వాలని బిజెపి భావిస్తోందని సమాచా రం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపో యారు. రాష్ట్రం మొత్తం మీద ఆయన పార్టీకి ఒకే ఒక్క స్థానం దక్కింది. ఆ ఎమ్మెల్యే కూడా పాలక వై.ఎస్.ఆర్ .కాంగ్రెస్ పాలన బాగుందని చెప్పి నియోజక వర్గ అభివృద్ధి పేరిట ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎందరో హాస్యనటులు , క్యారెక్టర్ ఆర్టిస్టుతో పాటు కొందరు హీరోయిన్లు సైతం ఎన్నికల బరిలో దిగి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత వరకు ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. వీటికి సమాధానం చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని పవన్ కళ్యాణ్ పంతంగా ఉన్నారు.

       వచ్చే ఎన్నికల్లో తాను గెలవడమే కాకుండా జనసేన తరపున మరి కొంతమందిని గెలిపించుకుని సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తే కచ్చితంగా వైసీపీని సాగనంప వచ్చని ఆయన నమ్ముతున్నారు. అందుకే టిడిపి-బిజెపిలను కలపాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు బిజెపి కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగించనుంది. మీరు ఎమ్మెల్యే పదవి గురించి ఎందుకు చూస్తున్నారు ఏకంగా రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేస్తాం కదా? అని బిజెపి అగ్రనాయకత్వం పవన్ కళ్యాణ్ కు ఆఫర్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా దీన్ని అంది పుచ్చుకోవాలా వద్దా? అందుకుంటే లాభమా నష్టమా? అన్న కోణాల్లో లోతుగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

      ఏపీలో 2029 నాటికి బిజెపిని బలీయమైన శక్తిగా తీర్చి దిద్దాలంటే పవన్ తమతోనే ఉండాలన్నది బిజెపి వ్యూహం. ఇక ఎన్టీయార్ కుటుంబం కూడా బిజెపితోనే ఉందని చాటి చెప్పడానికే ఎన్టీయార్ తనయ పురంధేశ్వరికి ఏపీ బిజెపి పగ్గాలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఆ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినపుడు ప్రత్యేకించి జూనియర్ ఎన్టీయార్ కు ఫోన్ చేసి మరీ తన హోటల్ కు పిలిపించుకుని ముచ్చట్లు పెట్టారు అమిత్ షా. జూనియర్ ఎన్టీయార్ ఇప్పటికిప్పుడు రాజకీయాలపై ఆసక్తి కనబర్చకపోయినప్పటికీ జూనియర్ కూడా తమ వాడేనని చాటి చెప్పడానికి ఇటువంటి భేటీలు పనికొస్తాయన్నది బిజెపి వ్యూహం కావచ్చునంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి అన్ని వైపుల నుండి నట్లు బిగించి చంద్రబాబు నాయుడికి ఊపిరాడకుండా చేయాలన్నదే నరేంద్ర మోదీ అసలు సిసలు వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్