34.2 C
Hyderabad
Monday, May 27, 2024
spot_img

సౌత్‌పై ఫోకస్‌ చేసిన బీజేపీ

   ప్రధాని మోదీ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ. రాజన్న దర్శనం అనంతరం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరపున ప్రచారం నిర్వహిస్తారు.ఎన్నికల ప్రచారానికి ఇక మూడు రోజులే మిగిలి ఉంది. చివరి మూడు రోజులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి అన్ని పార్టీలు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోవడం లేదు. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. దీంతో సౌత్‌పై టార్గెట్‌ చేసిన కమలనాథులు ఏపీ, తెలంగాణకు క్యూ కట్టారు. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ అధిష్టానం. అభ్యర్థుల తరపున మరోసారి క్యాంపెయిన్‌కు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉదయం వేములవాడకు బయల్దేరారు. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తయిన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్‌ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం.వరంగల్ సభ అనంతరం ప్రధాని మోదీ ఏపీకి బయల్దేరి వెళ్తారు. కడప జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు మోదీ.

Latest Articles

ఆ ప్రశ్నకు ‘ల‌వ్‌, మౌళి’లో సమాధానం దొరుకుతుంది: నవదీప్

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్