హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు. బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు.