శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహిం చారు నాయకులు, కార్యకర్తలు. పుట్టినరోజు సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతరం బాలకృష్ణను శాలువాతో సన్మానించి, వినాయ కుని చిత్రపటాన్ని బహుకరించారు అర్చకులు. నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని బీరప్పస్వామి దేవాలయం లో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు పూజలు చేసి కేక్ కట్ చేశారు. బాలకృష్ణ వ్యక్తి కాదని శక్తి అని బాలయ్య అభిమానుల సంఘం నాయకులు రామకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో పేదలకు చికిత్స అందించడం, సినిమా, రాజకీయాల్లో రాణించడం ఒక్క బాలకృష్ణకే సాధ్యమన్నారు.


