22.2 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

మారుతున్న బీహార్ రాజకీయ చిత్రం

  2024 పార్లమెంటు ఎన్నికలు బీహార్ లో ప్రధానిమోదీ, నితిశ్ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల మారిన సమీకరణల నేపథ్యంలో జేడీయూ చీఫ్ నితిశ్ కుమార్ మళ్లీ.. ఎన్డీఏ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో బీహార్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఉత్సాహంలో బీజేపీ, జేడీయూ ఉన్నాయి. మరోపక్క ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహా ఘఠ్ బంధన్ గా ఎన్డీఏకి గట్టి పోటీ సవాల్ విసురుతున్నాయి. నితిశ్ కుమార్ మళ్లీ బీజేపీ వైపు చేరడంతో బీహార్ లో బలమైన ముస్లీం కమ్యునిటీ మహాగఠ్ బంధన్ కు అండగా నిలిచే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలు నితిశ్ కు అగ్నిపరీక్షే.

  జాతీయ రాజకీయాల్లో బీహార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా అందరూ ఊపిరి బిగబట్టి తీర్పు కోసం ఎదురు చూసే రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. బీహార్‌లో మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీహార్‌లోని 40 సీట్లలో 39 సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంది. బీహార్‌లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు రెండు విడతల పోలింగ్ పూర్తయింది. మే 7న మూడో దశలో ఝంజర్పూర్, సుపౌల్, అరారియా, మాధేపురా, ఖగారియా స్థానాలకు పోలింగ్ నిర్వహి స్తారు. బీహార్‌లో సిద్దాంతాల రాద్ధాంతాల కంటే కులాల కుమ్ములా టలే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీయే కూటమి ప్రతిపక్షాల ఆధ్వర్యంలోని మహాఘట్‌బంధన్‌ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. ఇక్కడో విశేషం ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. అయితే అప్పటికి జేడీయూ ఎన్డీయే కూటమిలో ఉంది. కాగా జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ అకస్మాత్తుగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ , కాంగ్రెస్ తో కలిసి బీహార్‌లో సర్కార్ ఏర్పాటు చేశారు. అలాగే ఇండియా కూటమి ఏర్పాటుకు నితీశ్ కుమారే చొరవ చూపారు. అయితే కొన్ని నెలల కిందట ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు. ఇండియా కూటమికి గుడ్‌బై కొట్టారు. మళ్లీ ఎన్డీయే కూటమి లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ మద్దతుతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగాప్రమాణస్వీకారం చేశారు.

    ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీతో జేడీయూ పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి, కాంగ్రెస్ నాయకత్వం లోని ఇండియా కూటమితో తలపడుతోంది. ఇదిలా ఉంటే, నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమిలోకి ప్రవేశించడం చాలా మంది బీహారీయులకు మింగుడుపడలేదంటారు రాజకీయ పరిశీలకులు. ఎన్డీయే కూటమిలో చేరడంతో ఆయనపై ఒక అవకాశవాది అనే ముద్ర పడింది. దీంతో సామాన్య ప్రజల్లో నితీశ్ పరపతి తగ్గింది. తరచూ శిబిరాలు మార్చే రాజకీయ నాయకుడిగా నితీశ్‌ను ప్రజలు చూడటం మొదలెట్టారు. అంతేకాదు జేడీయూ కు అండగా నిలిచే ముస్లిం మైనారిటీలు పార్టీకి దూరం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే తన సామాజికవర్గమైన కుర్మీలతోపాటు ఇతర వెనుకబడిన తరగతుల మద్దతుపై నితీశ్ కుమార్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. బీహార్ జనాభా లో ఓబీసీలు 36 శాతం ఉన్నారు. ఇదిలా ఉంటే దాదాపు ఏడాదికిందట నితీశ్ కుమార్ బీహార్లో కులగణన చేపట్టారు. దేశంలోనే కులగణన చేసిన తొలి ముఖ్యమంత్రిగా పేరు నమోదు చేసుకున్నారు నితీశ్‌. దీంతో ఈ ఎన్నికల్ల ఓబీసీలు తనవైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు నితీశ్ కుమార్.

    బీహార్‌లో కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే కొనసాగుతోంది. 1990 వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికైన తరువాత యాదవులు, దళితులు, వెనుకబడిన వర్గాల న్నిటినీ ఏకం చేయడంలో లాలూ ప్రసాద్ విజయం సాధించారు. ఆ తరువాత బీహార్ రాజకీయాలపై నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఆధిపత్యమే కొనసాగింది. జాతీయ పార్టీలైన అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బీహార్‌లో పూర్తిస్థాయిలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

    నితీశ్ కుమార్ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఆర్జేడీకి ప్లస్ పాయింట్‌ గా మారింది. కిందటిసారి ఎన్నికల్లో కేవలం రెండు మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాలపై ఈసారి రాష్ట్రీయ జనతాదళ్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సెగ్మెంట్లలో గెలుపు కోసం ఆర్జేడీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తు న్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16 సీట్లు అలాగే చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ ఐదు సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నాయి. వీటితోపాటు జితన్ రామ్ మాఝీ పార్టీ , ఉపేంద్ర కుష్వాహ పార్టీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఇక మహాఘట్‌ బంధన్ విషయనికి వస్తే ఆర్జేడీ 26 సెగ్మెంట్లలో, కాంగ్రెస్ తొమ్మిది సెగ్మెంట్లలో, సీపీఐ, సీపీఎం చెరో స్థానంలోనూ పోటీ చేస్తున్నాయి. కాగా సీపీఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ పార్టీ మూడు స్థానాల్లో పోటీలో ఉంది. ఇంకా అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటితోపాటు బీఎస్పీ, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ వంచి చిన్న పార్టీలు కూడా ఎన్నికల గోదాలో ఉన్నాయి. ఏమైనా ఈసారి ఎన్నికలు లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని మహాఘట్‌ బంధన్‌కు అగ్నిపరీక్షగా మారాయి. బీజేపీ, జేడీ యూ కూటమి హవాకు అడ్డుకట్ట వేయడానికి మహాఘట్‌ బంధన్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఆర్జేడీ బలపడిందన్నది వాస్తవం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్