మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బళ్లారి వెళ్లేందుకు తనకు అవకాశం కల్పించేలా బెయిల్ నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించిన గాలి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న ఆయన ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి కోర్టుకు వచ్చే వెసులుబాటు కల్పించాలన్న విజ్ఞప్తిని కూడా జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్ధన్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.